సికింద్రాబాద్ జనవరి 30, ప్రజాపాలన సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నామలగుండు నుంచి సీతాఫలమండి మీదుగా చిలకలగూడ గాంధీ విగ్రహం వరకు ఘనంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సచిన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇంచార్జి అదం సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దేశ చరిత్రను విలువలను అవమానించడమే అని సచిన్ తన ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ గాంధీజీ పేరు తీసేస్తే పేదల జీవితం మారిపోతుందా? ఇది కేవలం పేరు కాదు పేదల హక్కు, ఉపాధికి హామీ గాంధీ పేరు తొలగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు అలాగే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన BB Ji – Ream Ji’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చట్టాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు అదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకం పేదల హక్కులను కాలరాస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు
ప్రజల కోసం రోడ్ల మీదికి వచ్చి పోరాడుతుంది అని స్పష్టం చేశారు ర్యాలీ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు ఈ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, SC/ST సెల్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఈ కాగడాల ర్యాలీ విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
TELANGANA HYDERABAD
గాంధీ పేరు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
దేవరకొండ మున్సిపల్ బరిలోకి జనసేన పార్టీ సిద్ధం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్*
Mr. Gareth Wynn Owen, British Deputy High Commission
‘ఒలింపిక్స్-2036’ క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం : ప్రధాని మోదీ
మున్సిపల్ ఎన్నికల రంగంలోకి యువత