• Other News
  • Live TV
  • అర్హత ఉన్న మైనార్టీలకు మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి : మైనార్టీ ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండి అజారుద్దీన్

    అర్హత ఉన్న  మైనార్టీలకు మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి : మైనార్టీ ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండి అజారుద్దీన్

    జనగామ: జనగామ పట్టణంలో ఆదివారం బీరప్ప గడ్డ ప్రాంతంలో ఆవాజ్ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఆవాజ్ కమిటీ సభ్యురాలు నుస్రత్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎండి అజారుద్దీన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అర్హులైన మైనార్టీ కుటుంబాలకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి మరియు వారికి జీవనోపాధి కింద కుట్టు మిషన్లు మరియు మైనార్టీ లోన్స్ ఇవ్వాలని అన్నారు ఈరోజు వెనుకబడిన తరగతులలో చదువు కోసం మరియు ఉపాధి కోసం అనేకమంది షాపులలో బీడీలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ పనిచేసుకుంటున్నారు కాబట్టి వారికి జీవనోపాధి కింద ప్రభుత్వము లోన్స్ ఇచ్చి ఆదుకోవాలని వారు అన్నారు లేకపోతే మైనార్టీలను ఐక్యం చేసి ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎండి సుల్తానా ఎంబి రహిమ ఎండి అంజుమ్ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow