• Other News
  • Live TV
  • మున్సిపల్ ఎన్నికల రంగంలోకి యువత

    మున్సిపల్ ఎన్నికల  రంగంలోకి యువత

    మున్సిపల్ ఎన్నికల రంగంలోకి యువత
    నేనావత్ కిషన్ నాయక్

    దేవరకొండ మున్సిపాలిటీ 8వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నేనావత్ నగేష్ నాయక్.

    నేడు దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరపున నేనావత్ నగేష్ నాయక్ గారు అత్యంత ఉత్సాహంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

    ఈ అవకాశం ఇచ్చిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ

    అభివృద్ధి ధ్యేయంగా 8వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

    పార్టీ నినాదం: కారు గుర్తుకే మన ఓటు - అభివృద్ధి వైపే మన బాట అంటూ కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేశారు.

    "మీ ఆశీస్సులు, మీ నమ్మకమే నా బలం. 8వ వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను అని ప్రజలనుద్దేశించి చెప్పారు
    ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow