• Other News
  • Live TV
  • అవినీతి రహిత పాలనకై యువత రాజకీయాల్లోకి రావాలనే

    అవినీతి రహిత పాలనకై యువత రాజకీయాల్లోకి రావాలనే

    నల్లగొండ
    దేవరకొండ(భవిష్యత్ ప్రజాపాలన)
    పవన్ కళ్యాణ్ సిద్ధాంతం తోనే మీముందుకు వస్తున్నా ఆశీర్వదించండి రుణపడి ఉంటా అంటూ తన మేనిఫెస్టో లోని కొన్ని కార్యక్రమాలు చెప్తున్నా..
    జనసేన పార్టీ ఇంచార్జ్ కోర్ర చందు నాయక్*

    నల్గొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి చేతులమీదుగా దేవరకొండ 16 వ వార్డు బిఫాం అందుకుంటున్న జనసేన పార్టీ ఇంచార్జ్ కోర్ర చందు నాయక్

    దేవరకొండ పట్టణం మున్సిపల్ ఎన్నికలకు దేవరకొండ పట్టణంలో 16 వార్డుకు నామినేషన్ వేసి జనసేన పార్టీ కదం తొక్కింది నలగొండ జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న దేవరకొండ నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్ అనంతరం చందు నాయక్ మాట్లాడుతూ.. దేవరకొండ 16వ వార్డుకు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో జనసేన పార్టీ రంగంలో దిగింది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలే ఆదర్శంగా అవినీతి రహిత పాలనకై యువత రాజకీయాల్లోకి రావాలనే స్ఫూర్తితో మీ ముందుకు వస్తున్నాను మీ ఆశీర్వాదంతో నేను గెలిచి మన వార్డుకు నేను చేయాల్సిన పనులు

    1.తాగునీటి పారిశుద్ధ్యం,
    2 రోడ్డు మరియు మౌలిక వసతులు, 3 ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా,
    4 మహిళా గౌరవం మరియు సాధికరత,
    5 యువత మరియు ఉపాధి,
    6 బలహీన వర్గాల సంక్షేమం,
    7 పారదర్శక మరియు ప్రజా పాలన,
    8 మరియు ప్రత్యేక హామీగా ప్రతి ఒక్కరి కుటుంబ భద్రత భరోసా కోసం జనసేన పార్టీ అధినేత శ్రీ
    9 పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సభ్యత్వం ఉచితంగా ఇప్పించడం,
    10 జనసేన పార్టీ సిద్ధాంతం కులం మతం చూడకుండా సమాన న్యాయం,

    మీ బిడ్డగా నేను గెలిస్తే

    మన వార్డులో అడబిడ్డ పుడితే మేనమామగా 5000 రూపాయలు కానుకగా,

    మన వార్డులో ఆడపడుచు పెళ్లికి తమ్ముడిగా 5000 రూపాయలు కానుక,

    దురదృష్టవ శాత్తు ఎవరైనా మరణిస్తే కుటుంబ సభ్యుడిగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు ఒక క్వింట బియ్యం

    కోర్ర చందర్ లాల్
    (చందు నాయక్)
    గాజు గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన అని ఓటర్లను అభ్యర్థించాడు

    📰 e-Paper Clip
    Google News Follow