Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/bhavishyatprajapalana.in/public_html/single.php on line 46
BHAVISHYAT PRAJA PALANA
  • Other News
  • Live TV
  • కంటోన్మెంట్ బోర్డు విలీనం అంశంపై రేణుకా చౌదరి తో భేటీ అయిన

    కంటోన్మెంట్ బోర్డు విలీనం అంశంపై రేణుకా చౌదరి తో భేటీ అయిన

    కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

    సికింద్రాబాద్ 03 ఫిబ్రవరి, ప్రజాపాలన కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు 6 ఏళ్ళ నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని నిరసిస్తూ,GHMC అభివృద్ధితో పోల్చుకుంటే 30 ఏళ్ళు వెనుకబడ్డ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం నామినేటెడ్ వ్యవస్థను రద్దుచేసి బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇటీవల కంటోన్మెంట్ ప్రజల పక్షాన చేసిన రిలే నిరహార దీక్షకు వచ్చిన స్పందనను మంగళవారం కేంద్ర మాజీ మంత్రి ,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని బంజారా హిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకం గా కలిసి తెలియజేసి బోర్డు విలీనానికి తమవంతు ప్రయత్నం చేయాలని రిప్రజెంటేషన్ అందజేశారు కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యే శ్రీగణేష్ చేస్తున్న పోరాటానికి రేణుకా చౌదరి తన వంతు మద్దతు ఉంటుందని తెలిపి ప్రత్యేకంగా అభినందించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాల్సిన ఆవశ్యకత గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడుతానని తెలిపారు

    📰 e-Paper Clip
    Google News Follow