సికింద్రాబాద్, 03 ఫిబ్రవరి, ప్రజాపాలన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (ఫిబ్రవరి 4) సందర్భంగా, సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో యునైటెడ్ బై యూనిక్యూ అనే నినాదంతో ప్రత్యేక అవగాహన ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు క్యాన్సర్ నుంచి కోలుకున్న వారు (సర్వైవర్లు) ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రారంభ దశలో గుర్తింపు మరియు సకాలంలో చికిత్స ఎంత ముఖ్యమో తమ అనుభవాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా డా. నివేద్ రావు బల్మూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మాట్లాడుతూ భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతున్నదని తెలిపారు. “దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. గణాంకాల ప్రకారం, ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే 50 శాతం కంటే ఎక్కువ కేసులు నివారించగలిగేవి లేదా పూర్తిగా నయం చేయగలిగేవి” అని పేర్కొన్నారు,అదేవిధంగా, ప్రారంభ దశలో గుర్తించిన క్యాన్సర్ కేసుల్లో 70 నుంచి 90 శాతం వరకు జీవన అవకాశాలు ఉంటాయని, అవగాహన లోపం కారణంగా చాలామంది రోగులు చివరి దశలోనే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. డా. గౌతమ్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, మాట్లాడుతూ, క్యాన్సర్‌పై భయం మరియు అపోహల కారణంగా చికిత్స ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సల ద్వారా ప్రారంభ దశలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయి అని చెప్పారు,కార్యక్రమంలో పాల్గొన్న క్యాన్సర్ సర్వైవర్లు తమ పోరాట అనుభవాలను పంచుకుంటూ, సకాలంలో వైద్యులను సంప్రదించడం మరియు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం వల్లే తాము ఆరోగ్యంగా కోలుకున్నామని తెలిపారు. వారు కొత్తగా క్యాన్సర్ నిర్ధారణ అయిన రోగులకు అవగాహన కల్పించే ఫస్ట్ రెస్పాండర్స్ గా ముందుకు రావాలని పిలుపునిచ్చారు,ప్రత్యేకంగా, ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ నుంచి కోలుకున్న సర్వైవర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్స్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేశారు ఇది చికిత్స అనంతరం కూడా రోగులకు నిరంతర వైద్య మద్దతు అందించాలనే ఆసుపత్రి ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ రోగి కేంద్రిత చికిత్స, వ్యాధి నివారణ మరియు ప్రారంభ గుర్తింపు పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటింది,కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు రోగులు పాల్గొన్నారు.
TELANGANA HYDERABAD
ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
దేవరకొండ మున్సిపల్ బరిలోకి జనసేన పార్టీ సిద్ధం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్*
Mr. Gareth Wynn Owen, British Deputy High Commission
‘ఒలింపిక్స్-2036’ క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం : ప్రధాని మోదీ
మున్సిపల్ ఎన్నికల రంగంలోకి యువత