జనగామ జిల్లా:
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలను కొడకండ్ల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కొడకండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు,మార్కెట్ డైరెక్టర్లు నాయకులతో కలిసి సురేష్ నాయక్ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు, ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రంలో వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు.పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తూ పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకై శ్రమిస్తున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గారు భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్,జిల్లా నాయకులు,నియోజకవర్గ యూత్ నాయకులు,మండల నాయకులు,AMC డైరెక్టర్లు,వివిధ గ్రామాల సర్పంచ్ లు,వార్డు మెంబర్ లు,మహిళా నాయకులు,సోషల్ మీడియా నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
TELANGANA JANGOAN
ఘనంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు..
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
దేవరకొండ మున్సిపల్ బరిలోకి జనసేన పార్టీ సిద్ధం జనసేన పార్టీ ఇంచార్జ్ కొర్ర చందు నాయక్*
Mr. Gareth Wynn Owen, British Deputy High Commission
‘ఒలింపిక్స్-2036’ క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాం : ప్రధాని మోదీ
మున్సిపల్ ఎన్నికల రంగంలోకి యువత