• Other News
  • Live TV
  • రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు

    రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు

    నల్లగొండ
    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే బాలు నాయక్
    దేవరకొండ(భవిష్యత్ ప్రజాపాలన) న్యూస్:- మున్సిపాలిటీ 20కి 19వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు.

    రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 20 వార్డుకు 19 మంది అభ్యర్థులకు పార్టీ బీ–ఫారాలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత గారితో కలిసి వార్డు అభ్యర్థులకు బీ - ఫారాలు అందజేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు.

    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ బీ–ఫారాలను అందజేసి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
    ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
    దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన దృష్టికోణంతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదాలతో ఈ ఎన్నికల్లో అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
    కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజల మద్దతు పొందాలని ఆకాంక్షించారు.
    దేవరకొండ మున్సిపాలిటీలో వందశాతం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. దేవరకొండలో తప్పకుండా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం.
    కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఎలాగైతే కష్టపడి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారో, అదేవిధంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలి అని అన్నారు.
    మున్సిపాలిటీలకు ఇచ్చే ప్రతి హామీని నెరవేర్చి, అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది
    19వ వార్డు లో పోటీలో లేమన్నారు మిత్రుడైన (తాళ్ల శ్రీధర్ గౌడ్ స్వాతంత్ర అభ్యర్ధి) నీ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు

    వార్డు సభ్యుల పేర్లు:-
    1.పొన్నబోయిన భూదేవి- సైదులు

    2. అంకూరి శివ ప్రసాద్

    3.అంకురి సుమలత - రాజేష్

    4.మహ్మద్ రయీస్

    5.గోవిందు పద్మ - జగతయ్య

    6.యండి. యూనుస్

    7.హన్మంతు సాయి చంద్ర గౌడ్

    8.కేతావత్ అజయ్

    9.నలగాసు మంగ - విజయ్ యాదవ్

    10.గుద్దేటి మాధవి - సత్యనారాయణ

    11.షేక్ నవీద్

    12.బిజిలి అంకులమ్మ - యాదయ్య

    13.పులిజాల చందన- ఆదిత్య

    14.గాజుల సావిత్రి - మురళి

    15.జువేరియా తబస్సుం - మహమ్మద్ నవాజ్ అహ్మద్

    16.ముడావత్ జయప్రకాష్(జేపీ)

    17.ఏకుల కరుణాకర్

    18.ఉప్పల శ్రీనివాసులు

    20.పున్న శైలజ వెంకటేశ్వర్లు (చైర్ పర్సన్ అభ్యర్థి)

    ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow