Banner
Watermark
అంగన్వాడీ కేంద్రంలో ఎస్‌బీఐ పాన్ ఇండియా సిఎస్‌ఆర్ కార్యక్రమం
📅 04 February 2026, 12:35 AM ✍️ admin
బండమైసమ్మ–1 అంగన్వాడీ కేంద్రంలో ఎస్‌బీఐ పాన్ ఇండియా సిఎస్‌ఆర్ కార్యక్రమం

హైదరాబాద్: సర్కిల్ పరిధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పాన్ ఇండియా స్థాయిలో చేపడుతున్న కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్‌బీఐ భాకరం శాఖ ఆధ్వర్యంలో, కవడిగూడ డివిజన్ పరిధిలోని బండమైసమ్మ–1 అంగన్వాడీ కేంద్రానికి చిన్నారుల అవసరాల కోసం పలు సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహణలో శాఖ అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి కె. రెడ్డి కీలక పాత్ర పోషించారు.

పిల్లలకు ఆట వస్తువులు, స్టేషనరీ, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, గడియారం పంపిణీ చేయడంతో పాటు, అంగన్వాడీ కేంద్రానికి రైస్ కుక్కర్, వాటర్ ఫిల్టర్, టీవీ, బుక్ స్టాండ్ వంటి మౌలిక వసతులు అందజేశారు.

ఈ సిఎస్‌ఆర్ కార్యక్రమాన్ని ‘మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ’ అమలు చేయగా, సంస్థ చైర్మన్ శ్రీమతి లక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సిడీపీఓ కృష్ణ చైతన్య, సూపర్‌వైజర్లు షేక్ సనేహెరా, కె. బాల, అంగన్వాడీ టీచర్ ధనమ్మ, ఆయా వనమాల, పిల్లల తల్లిదండ్రులు, బస్తీ పెద్దలు పాల్గొన్నారు.

సమాజ హితమే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని నిర్వాహకులు తెలిపారు.
🏠 Home