Banner
Watermark
ప్రజల అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా
📅 04 February 2026, 12:18 AM ✍️ admin
News Image
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ GTS కాలనీ TG జెన్‌కో ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ స్టేట్ పవర్ ఉద్యోగుల యూనియన్–1535 ఆధ్వర్యంలో నూతన పవర్ డైరీ–2026 ప్రారంభ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, ట్రాన్స్కో–జెన్‌కో విద్యుత్ అధికారులతో కలిసి పవర్ డైరీ–2026 మరియు క్యాలెండర్‌ను ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు..

తెలంగాణ స్టేట్ పవర్ యూనియన్–1535 ఉద్యోగులు ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిలబడాలంటే, ప్రజల జీవనం సాగాలంటే విద్యుత్తు ఎంతో కీలకమని ఎమ్మెల్యే గారు అన్నారు..

అదే విధంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజల అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసేందుకు అధికారులు రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారని ప్రశంసిస్తూ.. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్తు ఉద్యోగుల పాత్ర అమూల్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు..

డైరీ ఆవిష్కరణ వేదికపై విద్యుత్ ఉద్యోగి, 2025 తెలంగాణ జానపద విభాగం నంది అవార్డు గ్రహీత సిద్ధెల హుస్సేన్ గారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి పై పాట పాడి అలరించారు..

అనంతరం ఎమ్మెల్యే గారు నంది అవార్డు గ్రహీత సిద్ధెల హుస్సేన్ గారిని శాలువాతో సత్కరించారు..

ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, ట్రాన్స్కో మరియు జెన్‌కో విద్యుత్ ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
🏠 Home